KTR: వరుస కార్డియాక్ అరెస్టులు.. కేటీఆర్ కీలక సూచనలు!
KTR: హరీష్ రావు మంత్రిగా వచ్చిన తర్వాత వైద్య రంగం ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్న ఆయన కంటి వెలుగు, టి డయజ్ఞాస్టిక్స్ అందుబాటులోకి తెచ్చామని, రాష్ట్రంలో వైద్య సదుపాయాలు పెంచామని అన్నారు. విదేశాల్లో మాస్టర్ చెకప్ చేయించుకుంటారు.. కానీ మన దగ్గర ఆ పరిస్థితి ఉండదని, లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి కాబట్టే సడన్ కార్డియాక్ అరెస్ట్ సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల ఓ యువకుడు పెళ్లిలో నృత్యం చేస్తూ చనిపోయాడు, మరో వ్యక్తి జిమ్ లో చనిపోయాడు, మా మామ ఇటీవల చనిపోయారని అన్నారు. ఆయన గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు, హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు, గుండెపోటు వచ్చిన సమయంలో ఏమి చేయాలో ఎవరికి తెలియక చనిపోతున్నారని ఆయన అన్నారు. హరీష్ రావుకు ఏం చెప్పినా వెంటనే రాసుకునే అలవాటు ఉందని, జన సంచారం ఉండే ప్రాంతాల్లో డీ ఫ్రిభ్యులేటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నానని రాబోయే రోజుల్లో మాల్స్, ఇతర ప్రాంతాల్లో డి ఫ్రిభ్యులేటర్లు కచ్చితంగా పెట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని అన్నారు రాబోయే రోజుల్లో ఒక లక్ష మందికి ట్రైనింగ్ ఇవ్వాలన్నా ఆయన ఒక ఐదుగుర్ని కాపాడినా ఐదు కుటుంబాలను కాపాడిన వారు అవుతామని అన్నారు.