KTR : కావాలని మత పిచ్చి, కుల పిచ్చి రేపుతున్నారు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఈరోజు జహీరాబాద్ లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రమని తెలంగాణ అని, రోజూ మంచి నీళ్ళు వస్తున్నాయని, ప్రభుత్వాలు పట్టించుకోవాల్సింది కనీస సౌకర్యాలని, పేదలను ఆదుకోవాలని అన్నారు. ఇక తెలంగాణాలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూడా ఈ సందర్భంగా వివరించారు. పెన్షన్లు అప్పట్లో 200 ఉంటే, ఇప్పుడు 2000 చేశామని, అత్త, కొడళ్లు మంచిగా కలిసి ఉంటున్నారని, 40 లక్షల ముందికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్ లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా కేటీఆ వెల్లడించారు. మరో నెలల్లో అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తామని, ఈ ప్రాంతంలో సంగమేశ్వర దేవుడు చాలా పవర్ ఫుల్ అని, సింగూరు నీళ్లు తెచ్చి మీ బీడు భూములన్నీ తడుపుతామని, లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ప్రజలకు తెలిపారు. సమైక్యాంధ్ర పాలనలో జహీరాబాద్ వెనుకబడి పోయిందని, యువతకు ఉపాధి కోసం త్వరలో మూడు పరిశ్రమలు వస్తున్నాయని, అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇక కొంత మంది కావాలని మత పిచ్చి, కుల పిచ్చి రేపుతున్నారని ఆరోపించారు. ఎన్ని ఛాన్సులు ఇచ్చిన కాంగ్రెస్ అంతేనని కేటీఆర్ అన్నారు.