KTR: మంచి చూపెట్టండి.. చేదు చేస్తే చీల్చి చెండాడండి!
KTR: మున్సిపల్ ఉద్యోగం థాంక్స్ లెస్ జాబ్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2018, మార్చి 8న వి.హబ్ ఏర్పాటు చేశామని పేర్కొన్న ఆయన ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. మహిళా జర్నలిస్టుల కోసం కొత్త కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్న ఆయన జర్నలిజంలో వస్తున్న కొత్త పోకడలను యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల ముందుకు తీసుకు వస్తున్నామని అన్నారు. ఇది రెండు రోజుల కార్యక్రమం అని ఆయన అన్నారు. కల్యాణ లక్ష్మి వల్ల బాల్య వివాహాలు తగ్గాయని పేర్కొన్న ఆయన కేసీఆర్ కిట్ వల్ల సురక్షిత ప్రసవాలు పెరిగాయని ఆయన అన్నారు. అలాంటి వాటిని కూడా చూపెట్టండని కోరిన ఆయన మేము తప్పు చేసినప్పుడు చీల్చి చెండాలని అన్నారు.
ఇక మహిళలపై దాడులు జరిగినప్పుడు స్పందించని వారు ఎవరు ఉండరు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందరూ ప్రభుత్వాన్ని నిందిస్తారని అన్నారు. రాత్రికి రాత్రి అన్ని జరగవన్న ఆయన ప్రభుత్వం ఉన్న వారికి మనస్సు ఉండదని అనుకోవద్దని అన్నారు. మహిళల్ని గౌరవించాలని చిన్నతనం నుంచి నేర్పించాలని అన్నారు. ఇక జెండర్ సెన్సివిటి కరిక్యులమ్ లో ఉండాలి. దానికి ప్రయత్నాలు జరగాలని ఆయన అన్నారు. మహిళలపై దాడుల నివారణ పట్ల చైతన్యం ఉండాలని ఆయన అన్నారు. ఇక రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో 19 వేల మందికి అక్రిడిటేషన్ గుర్తింపు ఉంది. గుజరాత్ లో కేవలం 3 వేల మందికి మాత్రమే గుర్తింపు ఉందని ఆయన అన్నారు.