KTR Challenge: పదవికి రాజీనామా చేస్తానని అన్నా..సవాల్ స్వీకరించలేదు!
KTR Challenge: రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాం అంటారు కానీ అప్పులపై నా సవాల్ స్వీకరించలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 మంది ప్రధానుల కంటే మోడీ ఎక్కువ అప్పులు చేశారని పేర్కొన్న ఆయన 14 మంది ప్రధానాలు రూ. 50 లక్షల కోట్లు అప్పులు చేశారని అన్నారు. ప్రధాని మోడీ ఒక్కడే వంద లక్షల కోట్లు అప్పులు చేశారని, వందల లక్షల కోట్లు ఏం చేశారంటే చెప్పే మొహం లేదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్ పై అదనపు సెస్ వేసి 30 లక్షల కోట్లు వసూలు చేశారని పేర్కొన్న ఆయన అవి ఏం చేశారంటే చెప్పడం లేదని అన్నారు. బీజేపీ తెలంగాణలో విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తోందని, కుల మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుంది, బీజేపీ నేతలు దగుల్బాజీ డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో రైతు బంధు ఎందుకు లేదో సమాధానం చెప్పాలని కూడా కేటీఆర్ విమర్శించారు. వందల లక్షల కోట్లు ఏం చేశారంటే సమాధానం చెప్పడానికి బీజేపీ నేతలకు మొహం లేదన్న కేటీఆర్ ఇది నిజం కాకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నానని అయినా తన సవాల్‌ను బీజేపీ నేతలు స్వీకరించలేదని తెలిపారు.