వామపక్షాలతో పొత్తులు లేవని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చేయడంతో ఇటు సీపీఐ(CPI) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ (KCR)పై పోటీ చేయాలన్న ప్రతిపాదన తనకు వచ్చిందని కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambasiva Rao) చెప్పారు.
Koonamneni : వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా కారుతోనే నడుస్తామని దీమాగా ఉన్న కామ్రేడ్లకు సీఎం కేసీఆర్ కాస్త గట్టిగానే షాక్ ఇవ్వడంతో వామపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారు. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆగస్ట్ 21న సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత.. వామపక్షాల్లో ఒక్కసారిగా అసంతృప్తి రాగాలు పెరిగిపోయాయి.
మునుగోడు(Munugodu) ఉపఎన్నిక(By Elections) సమయంలో సీఎం కేసీఆర్, తమను పిలిపించికొని మరీ మద్దతు కోరారని..కానీ అవసరం తీరాక వదిలేశారని సీపీఐ, సీపీఎం నేతలంతా ఫైర్ అవుతున్నారు. ఒక్క మునుగోడు ఉప ఎన్నిక సమయంలో .. తమ కలయిక ఈ ఎన్నికల కోసమే కాదంటూ..ఈ ఐక్యత ఢిల్లీ దాకా కొనసాగాలని ప్రకటించిన సంగతి కేసీఆర్కు ఇప్పుడెందుకు గుర్తు లేదని మండిపడుతున్నారు.
ఇక వామపక్షాలతో పొత్తులు లేవని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చేయడంతో ఇటు సీపీఐ(CPI) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ (KCR)పై పోటీ చేయాలన్న ప్రతిపాదన తనకు వచ్చిందని కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambasiva Rao) చెప్పారు.
కారు పార్టీ మిత్రద్రోహం చేసిందని..ఇండియా కూటమి మీటింగ్కు వెళ్లి తాము తప్పు చేశామని బీఆర్ఎస్ (BRS) అంటోందని ఆరోపించారు. బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా కాంగ్రెస్(Congress) పార్టీతో చాలా ఏళ్లు పని చేశామన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను ఎక్కడ పోటీ చేయాలనేది రాష్ట్ర కమిటీ (State Committee) నిర్ణయిందస్తుందని కూనంనేని సాంబశివరావు తెలిపారు.