Konda Vishweshwar Reddy: తెలంగాణలో బీజేపీ (BJP) సంకట స్థితిలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy). ప్రజలకు నమ్మకం కలిగించేలా బీజేపీ మరింత శ్రమించాలని వెల్లడించారు.
Konda Vishweshwar Reddy: తెలంగాణలో బీజేపీ (BJP) సంకట స్థితిలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy). ప్రజలకు నమ్మకం కలిగించేలా బీజేపీ మరింత శ్రమించాలని వెల్లడించారు. తెలంగాణలో ఈసారి ప్రాంతీయ పార్టీకి (Regional parties) అవకాశం లేదని.. ప్రజల మద్ధతు కేసీఆర్‌ను (KCR) ఎదుర్కొనే రాజకీయ పార్టీకే ఉంటుందని తెలిపారు. ప్రజలు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీని ఓడించగల సామర్థ్యం ఎవరికి ఉందా అని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు కెళ్లడం ఖాయమని అంతా భావించారని.. చివరిక్షణంలో అది జరగకపోవడంతో.. బీజేపీతో బీఆర్ఎస్కు ఏదో అవగాహన ఒప్పందాలున్నాయని ప్రజలు భావిస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీని వల్లనే తెలంగాణలో బీజేపీకి బ్రేకులు పడ్డాయని అన్నారు. అటు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే ‘‘ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ’’ అని విమర్శిస్తుండడంతో ప్రజలు సందిగ్ధంలో పడిపోయారన్నారు. కవిత అరెస్ట్ కవిత అరెస్ట్‌కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో బీజేపీకి అది పెద్ద సంకటంగా మారిందని వెల్లడించారు. అందుకోసమే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు బీజేపీలో చేరకుండా ఆగిపోయారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్, బీజీపలు చీల్చుకోవడం ద్వారా.. తిరిగి అధికారంలోకి రావచ్చనే వ్యూహంతోనే కేసీఆర్ ఉన్నారని అన్నారు. కానీ ఈసారి కేసీఆర్ వ్యూహాలు చెల్లవని వెల్లడించారు. కేసీఆర్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగే పార్టీకే ప్రజలు మద్ధతిచ్చి గెలిపిస్తారని విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు.