Komatireddy Venkat Reddy: గాంధీ భవన్లో కోమటిరెడ్డ్ ఎంట్రీ.. ఆసక్తికర చర్చ!
Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ కి ఇంచార్జి మానిక్ రావు ఠాక్రే వచ్చి పార్టీ కమిటీలతో సమావేశం అయ్యారు. దామోదర రాజనర్సింహ, మధు యాష్కీ, మహేశ్వర్ రెడ్డి వంటి వారితో సమావేశం అయి తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్, ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. అయితే ఈ క్రమంలో గాంధీ భవన్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రావడం హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త ఇంచార్జి ఆహ్వానం మేరకు వచ్చానని హాట్ సే హాత్ జొడో పై చర్చించామని అన్నారు. అంతేకాక ఆయన మాట్లాడుతూ గాంధీ భవన్ మెట్లు ఎక్కను అని నేను ఎక్కడా అనలేదని ఆయన అన్నారు. ఇక ఇంచార్జ్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కమిటీలో నేను చెప్పిన పేర్లు లేకపోవడం అభ్యంతరకరం అని, నాకు పార్టీలో సరైన గౌరవం దక్కాలని కోరినట్టు తెలుస్తోంది. ఇక పార్ట్ విషయంలో అందరి సమిష్టి నిర్ణయాలు ఉండాలని, ఇవన్నీ జరిగితే నేను మరింత ఉత్సాహంతో పని చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక గాంధీ భవన్ లో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ అవగా వారి మధ్య చర్చపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది.