Komatireddy Venkat Reddy: చెరుకు సుధాకర్ ని చంపేస్తానంటున్న కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy: టిపిసిసి ఉపాధ్యాక్షుడు చెరుకు సుధాకర్ ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చంపుతానని బెదిరించినట్టు తెలుస్తోంది. చెరుకు సుధాకర్ కుమారుడు డా:సుహాస్ కి ఫోన్ చేసి బెదిరించినట్టు చెబుతున్నారు. డాక్టర్ చెరుకు సుధాకర్ ని చంపుతామని చెప్పిన కోమటిరెడ్డి సుధాకర్ కోసం వంద వెహికల్స్ లో తిరుగుతున్నారని అన్నారు. వారం రోజుల్లో తమ మనుషులు చంపేస్తారు అని అంటూ బూతు మాటలతో రెచ్చిపోతూ నిన్ను కూడా చంపేస్తారని అంటూ సుధాకర్ కుమారుడు సుహాస్ ను బెదిరించారు.
నీ హాస్పిటల్ ఉండదు నిన్ను కూడా చంపేస్తారని కోమటిరెడ్డి బెదిరించినట్టు చెబుతున్నారు. ఇక ఈ మేరకు ఉన్న ఒక ఆడియో ఫోన్ కాల్ రికార్డు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కూడా తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారని అంటూ ఇక నుంచి తాను రేవంత్ రెడ్డి ముఖం చూడనని ఎంపీ అప్పట్లో కామెంట్ చేశారు.