Komatireddy: కవిత నోటీసులపై రేవంత్ ఎందుకు స్పందించ లేదు?
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ అధినేత కుమార్తె కవితకు వచ్చిన నోటీసుల పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కవితకు జారీ అయిన ఈడీ నోటీసులపైన రేవంత్ స్పందించాలని డిమాండ్ చేసిన ఆయన ఉదయం నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
పీసీసీ చీఫ్, ఇంఛార్జ్ జనరల్ సెక్రట్రీ దీని పైన మాట్లాడాలన్న ఆయన కవిత నోటీసుల పై రేవంత్ ను ప్రశ్నించాలని అన్నారు. ఇక నేను నా పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాలకు పరిమితం అయ్యాను అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక అలాగే సోషల్ మీడియా వచ్చాకే భయం, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు, ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. డాక్టర్ చెరుకు సుధాకర్‌కు తనకు మధ్య తాజాగా నెలకొన్న వివాదంపై ఆయన స్పందిస్తూ తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానన్నారు ఆయన. న్యాయస్థానంపై గౌరవం ఉందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు
.