KomatiReddy Rajgopal Reddy: మునుగోడు ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ కు భారీ ఊరట కల్పించింది ఎన్నికల సంఘం. ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా పెద్ద ఎత్తున నిధులను ఇతరులకు పంపిణీ చేశారంటూ కోమటిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం… ఆ ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. కోమటిరెడ్డి కంపెనీ ఖాతా నుంచి ఇతరులకు రూ.5.26 కోట్లు బదిలీ అయ్యాయని కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టింది. అయితే కోమటిరెడ్డిపై అందిన ఫిర్యాదుకు ఆధారాలేమీ లేవని ఈ సి తెలిపింది.
ఇదిలా ఉంటె మునుగోడు ఉప ఎన్నికలో ప్రధానంగా టిఆర్ఎస్ – బిజెపి మధ్యనే పోటీ నెలకొంది ఉంది. ప్రస్తుతం అందుతున్న సర్వేల ప్రకారం టిఆర్ఎస్ పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. దీంతో బీజేపీ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ గట్టి పోటీ ఇవ్వదు కాబట్టి ఆ పార్టీ ఓట్లను లాగేందుకు బిజెపి చూస్తుంది. కానీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఇక్కడే ఎక్కువుందని మేమె గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఏదేమైనా ఆరవ తేదీన మునుగోడు ఎమ్మెల్యే ఎవరనేది తెలుస్తుంది.