కేటీఆర్ ఛాలెంజ్ కు స్పందించిన కిషన్ రెడ్డి
మళ్ళీ అధికారంలోకి రాము అనే నమ్మకం కేసీఆర్ కుటుంబానికి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చాలా దుర్మార్గంగా తెలంగాణలో తండ్రి కొడుకులు -కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. మంత్రి పువ్వాడ ,టీఆరెస్ లీడర్ లు అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించిన ఆయన ఖమ్మం, కొత్తగూడెంలో చాలా దారుణ మైన పరిస్థితి ఉందని, టీఆరెస్ కు ఒక్క హక్కు, మరో పార్టీకి మారో హక్కు ఖమ్మంలో ఉన్నాయని ఆయన అన్నారు. సాయి గణేష్ ను రెండు సార్లు ఎందుకు జైల్ కు పంపారు ? బీజేపీలో పని చేయడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. మీ అహంకార పూరిత వైఖరిని అడ్డుకోవడం నేరమా? ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేశారు? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి కానీ, పోలీస్ అధికారులు కానీ సాయి గణేష్ వెళ్లిన జైల్ కు వెళ్లాల్సిందే, న్యాయస్థానంలో , ప్రజా క్షేత్రంలో పోరాడుతామని అన్నారు. ఇక తెలంగాణలో లక్ష్మణ రేఖ దాటుటున్నారని ల్యాండ్, లిక్కర్,సాండ్ మాఫియా, రైస్ మాఫియా రాష్టంలో వేళ్ళూనుకు పోయిందని అన్నారు. ఇక కేటీఆర్ ఛాలెంజ్ కు స్పందిస్తూ 8 ఏళ్లుగా మీరు ఎంత ఖర్చు చేశారో? కేంద్రం ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తామన్న ఆయన సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. ఎవరినీ వదిలి పెట్టం, వచ్చేది బీజెపీ ప్రభుత్వమే అని ఆయన అన్నారు.