Kishan Reddy: రుణమాఫీ అమలు చేయక పోవడంతో ఇబ్బందులు.. అలా చేయమంటున్న కిషన్ రెడ్డి
Kishan Reddy Crucial Comments on Telangana Banks: తెలంగాణలో బ్యాంకులు బాగా పని చేస్తున్నాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పంట రుణాలు 22 – 23 లో టార్గెట్ లో 58 శాతం రైతులకు ఇచ్చాయని ఆయన అన్నారు. గత ఏడాది 42 వేల 800 కోట్లు రైతు రుణాలు ఇచ్చాయని పేర్కొన్న ఆయన తెలంగాణలో డిపాజిట్ ల కన్నా ఎక్కువ రుణాలు బ్యాంకులు ఇచ్చాయని అన్నారు. 2 లక్షల 68 వేల 853 మందికి 4 వేల 484 కోట్లు ముద్ర లోన్లు ఇచ్చాయని, స్టాండ్ అప్ కింద 9 వేల 44 మంది లోన్ లు పొందారని అన్నారు. ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద 5 లక్షల 21వేల 862 మందికి రుణాలు.. 1427 కోట్లు ఇచ్చాయని అన్నారు. వ్యవసాయ మౌలిక వసతుల కోసం ఇప్పటి వరకు 773 కోట్లు రుణాలు ఇచ్చాయని పేర్కొన్న కిషన్ రెడ్డి అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉందని అన్నారు.
పావలా వడ్డీకే రైతులకు, మహిళా సంఘాలకు రుణాలు విషయంలో సహకరించాలని అన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఇన్సెంటివ్ లు ఇవ్వడం లేదని అన్నారు. ఇన్సెంటివ్స్ ఇవ్వక పోవడంతో చిన్న పారిశ్రామిక వేత్తలు రుణాలు తీసుకోలేక పోతున్నారని ఆయన అన్నారు. ఎఫ్పీఓలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని పేర్కొన్న ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెరగాలని అన్నారు. రుణమాఫీ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయక పోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న కిషన్ రెడ్డి రైతులకు రుణాలు సకాలంలో అందే పరిస్థితి లేదని అన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని అందుకే వెంటనే రుణ మాఫీ చేయాలని ప్రభుత్వం ని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రైతుల అకౌంట్ లో పడ్డ డబ్బులను బ్యాంకు లు పట్టుకుంటాయి… అది రూల్…. పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీల నిధులను కూడా ప్రభుత్వం తీసుకోవడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.