తెలంగాణ రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం మరోసారి అండగా నిలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి మరో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Kishan reddy assures Farmers of Telangana that Central government will always be with them
తెలంగాణ రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం మరోసారి అండగా నిలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి మరో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
2021-22 రబీ సీజన్/2022-23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఇప్పుడు 2022-23 (ఖరీఫ్ + రబీ) సీజన్లకు సంబంధించి మరో 6.80 లక్షల టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
తెలంగాణ రైతులకు మద్దతునందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు కొంత ఊరటనిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ నిరంతర సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి, త్వరగా మిల్లింగ్ చేయించాలన్న కిషన్ రెడ్డి రైతులను కోరారు.
ఇచ్చిన గడువు లోపు FCI కు బియ్యాన్ని అందజేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత నెల్లో కేంద్రమంత్రి ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ నుంచి 15 లక్షల మెట్రికల్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిందిగా కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.