Puvvada Ajay: ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సక్సెస్ అయింది..మంత్రి పువ్వాడ
Puvvada Ajay: ఖమ్మంలోనిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ తొలి ఆవిర్భావ భారీ బహిరంగ సభ విజయవంతం అయిందన్నారు పార్టీ శ్రేణులు. సభకు లక్షలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ముగ్గురు ముఖ్యమంత్రులతో ఒక మాజీ ముఖ్యమంత్రి తో నిర్వహించిన సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. మైదానంలో ఒక చిన్నపాటి సముద్రం కనిపించిందన్నారు ఇక మైదానం సరిపోక బయటే ఓ లక్షమంది దాక ఉండిపోయారన్నారు.
సంక్రాంతి పండగ 15 వ తేదీ రోజు ఉన్నా తెలంగాణ ప్రజలు 18వ తేదీన సంక్రాంతి జరుపుకున్నారు అని అన్నారు..నిరంతరం ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షించిన మంత్రి హరీష్ రావు కు ధన్యవాదాలు తెలుపుతున్నాను.. అలాగే ఖమ్మం లో ఉన్న ప్రతి కార్య కర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మంకు భారీగా నిధులు ప్రకటించినందుకు కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని పేర్కొన్నారు.
సభ ఇంత పెద్ద సక్సెస్ అయితే కాలేదని ప్రతిపక్షనేతలంటున్నారు. బండిసంజయ్ కంటివెలుగులో చికిత్స చేయించుకుంటే మంచింది. కావాలంటే మేమె ఒక టీమ్ ను పంపిస్తాం కళ్ళ పరీక్షచేసి కళ్లజోడులు ఇస్తాం. ఇక కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ సభపై పలు కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ను ఓడించడానికి సుపారీ లు అవసరం లేదు.. వాళ్ళ నేతలే చాలు. ముందుగా మీ ఇల్లు చక్కదిద్దుకోండి అని అన్నారు.
ఖమ్మం బీఆర్‌ఎస్ సభ విజయవంతం కావడంపై కేసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి , బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధులకు సీఎం కేసీఆర్ పోన్ చేసి అభినందించారు. జిల్లా నేతలు సమష్టిగా కృషి చేయడంతోనే ఈ సభ విజయవంతం అయ్యిందని, భవిష్యత్ లో కూడా ఇదే విధంగా కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ నేతలకు సూచించారని తెలుస్తుంది.