తెలంగాణలో రాజకీయ(Telangana politics) సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. కేసీఆర్(CM KCR) ఏం చేసినా ఓ లెక్కుంటుంది. దానివెనక ఒక భారీ వ్యూహం ఉంటుంది. ఎక్కడ తగ్గాలో ఎలా నెగ్గాలో కేసీఆర్‌కు తెలిసినట్టు మరెవరికి తెలియదు. సరిగ్గా ఎన్నికల(Elections) సమయంలో కేసీఆర్ అదే చేస్తున్నారు.
CM KCR : తెలంగాణలో రాజకీయ(Telangana politics) సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. కేసీఆర్(CM KCR) ఏం చేసినా ఓ లెక్కుంటుంది. దానివెనక ఒక భారీ వ్యూహం ఉంటుంది. ఎక్కడ తగ్గాలో ఎలా నెగ్గాలో కేసీఆర్‌కు తెలిసినట్టు మరెవరికి తెలియదు. సరిగ్గా ఎన్నికల(Elections) సమయంలో కేసీఆర్ అదే చేస్తున్నారు. ఎన్నికల వేళ తనకు అనుకూలంగా రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.
రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య రాజీ కుదిరింది. సరిగ్గా ఎన్నికల సమయంలో గవర్నర్‌కు సీఎం ఘన స్వాగతం పలికారు. కేంద్రంతో పోరాటం వేళ గవర్నర్‌తో పెరిగిన గ్యాప్‌ను ఒకే ఒక్క ఆహ్వానంతో కేసీఆర్ భర్తీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను సైతం గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. ఎంపిక చేసిన ఎమ్మెల్సీల ఆమోదంలోనూ కొర్రీలతో తన పవర్ ఏంటో చూపించారు తమిళిసై. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కేసీఆర్‌కు ఎన్నికలకు తక్కువ సమయం ఉంది. ప్రతిపక్షాలు తీసుకునే ప్రజాకర్షణ నిర్ణయాలతో అధికారంలో ఉంటూ తానే కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
ప్రతిపక్షాలు చేసే ప్రకటనలను తాను ముందుగానే అమలు చేస్తూ అపోజిషన్‌ను పరేషాన్ చేయాలనేది కేసీఆర్ టార్గెట్. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి. ఇక ఎటువంటి కీలక నిర్ణయాలైనా తీసుకోవాల్సింది కేబినెట్, ఆమోదించాల్సింది గవర్నర్. దీంతో ఈ మూడునెలల కాలంలో ప్రభుత్వ నిర్ణయాలకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి కానుంది. ఏ ఒక్క నిర్ణయం ఆమోదం పొందకపోయినా… ఓటింగ్‌పై ప్రభావం చూపుతుంది. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ అప్రమత్తమయ్యారు.
నెగ్గడం కోసం తగ్గినా ఫర్వాలేదనుకున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం లేదు. కానీ ఇప్పుడు రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్ సచివాలయానికి రావాలంటూ గవర్నర్‌ను ఆహ్వానించారు. మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాటలు కలిపారు. సచివాలయంలో మందిరం, మసీదు, చర్చి ప్రారంభోత్సవానికి రావాలంటూ స్వయంగా ఆహ్వానించారు. గతంలో తనకు ఆహ్వానం లేక హాజరుకాలేదని చెప్పిన గవర్నర్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించడంతో హాజరయ్యారు. గవర్నర్‌కు సీఎం స్వయంగా స్వాగతం పలికారు. ఇద్దరూ గతం మరిచి కలివిడిగా వ్యవహరించారు.
ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి గవర్నర్ వద్దకు ఆమోదం కోసం వెళ్లిన పెండింగ్ బిల్లులకు లైన్ క్లియర్ లాంఛనంగా కనిపిస్తోంది. రాజ్‌భవన్ భేటీలోనే గతం గతః అనే ఫార్ములాకు ఇద్దరు సిద్ధపడినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌కు అఫీషియల్‌గా రూట్ క్లియరైనట్లే.