Bandi Sanjay: కేసీఆర్ తెలంగాణను శ్రీలంకలా మార్చాలని చూస్తోన్నారు: బండి సంజయ్
Bandi Sanjay Fire on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన అటకెక్కిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. 2014లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అప్పులకు అనుమతిస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చాలని చూస్తోన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే పాలన కొనసాగిస్తూ తిరిగి కేంద్రంపైనే నిందలు వేస్తున్నారన్నారు. విభజన చట్టం హామీల పరిష్కారానికి కేసీఆర్ ఎప్పుడైనా చోరవతీసుకున్నారా అని నిలదీశారు.
నీతి అయోగ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తోందని అధికార పార్టీకి చెందన నేతలు అంటున్నారన్న సంజయ్.. దమ్ముంటే ఆధారాలు చూపించాలన్నారు. వరదల వల్ల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతుంటే కాపాడాల్సింది పోయి.. రాజకీయాలు చేస్తోన్నారని విమర్శించారు. గత వారం రోజులుగా ముంపు ప్రాంతాలు నిళ్లలో నానుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ నుంచి బయటకు రావడంలేదని బండి సంజయ్ మండిపడ్డారు.