KCR: సగం మంది మంత్రులకు ఈసారి టికెట్లు డౌటే?
KCR to Give Shock to 10 Ministers: మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సీట్ల పంపకాల మీద కూడా దృష్టి పెట్టాయి. అధికార బీఆర్ఎస్ కూడా అందరి కంటే కొంచెం ముందు ‘మరోసారి సిట్టింగులకే సీట్లు..’ అని ప్రకటించింది. ఈ క్రమంలో అందరూ రిలాక్స్ అయ్యారు. అయితే కేసీఆర్ మాత్రం ఒక ప్రత్యేక సర్వే చేయించగా అందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. దీంతో షాక్ తిన్న కేసీఆర్ మంత్రులుగా కొనసాగుతున్న వారిలో 10 మందికి మరోసారి టికెట్ ఇవ్వడం మీద పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెడ్డి ,బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకి చెందిన వారిపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని కేసీఆర్ కు అందిన నివేదికలో ఉండటంతో వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు డౌటే అనే ప్రచారం సాగుతోంది. వీరిలో కొందరు మంత్రుల బంధువులు, అనుచరులు తీవ్రంగా దోచుకుంటున్నారని ఉన్న 10 మంది మంత్రుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని అంటున్నారు. మంత్రులపై ఇంత వ్యతిరేకత ఉంటే ఆ సీట్లు కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్న కేసీఆర్ మరోసారి ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ఇది ఇప్పటికే తెలంగాణలో ఓ వైపు బీజేపీ బలపడే అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇంత వ్యతిరేకత ఉన్న మంత్రులకు మరోసారి టికెట్ ఇస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉన్న క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.