మంత్రి కేటీఆర్( Minister KTR)కు ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)కౌంటర్ ఇచ్చారు. యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే నని చెప్పిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)..కేసీఆర్ ఖేల్ ఖతం(KCR Khel Khatam) , బీఆర్ఎస్ దుఖాన్ బంద్(BRS Dukhan Bandh) అని ట్వీట్ చేశారు.
Revanth Reddy : మంత్రి కేటీఆర్( Minister KTR)కు ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)కౌంటర్ ఇచ్చారు. యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే నని చెప్పిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)..కేసీఆర్ ఖేల్ ఖతం(KCR Khel Khatam) , బీఆర్ఎస్ దుఖాన్ బంద్(BRS Dukhan Bandh) అని ట్వీట్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన డిక్లరేషన్(Declaration)పై.. అది డిక్లరేషన్ సభ కాదు, అధికారం ఇక రానే రాదనే పెట్టుకున్న కాంగ్రెస్ ప్రస్ట్రేషన్ సభ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
దీంతో రేవంత్ రెడ్డి(Revanth Reddy) .. మంత్రి కేటీఆర్(Minister KTR)కు ట్యాగ్ చేస్తూ కౌంటర్ ట్వీట్ పోస్ట్ చేశారు. తమ డిక్లరేషన్(Declaration).. ఎస్సీ, ఎస్టీ జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ అని, దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). అంతేకాదు ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేయడం వంటిది కాదని రేవంత్ అన్నారు. గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం వంటిది కూడా కాదని చెప్పుకొచ్చారు. అంతటితో ఊరుకోకుండా మద్దతు ధర అడిగిన గిరిజన రైతులకు.. బేడీలు వేసి అవమానించడం వంటిది కాదని సెటైర్ వేశారు.దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల వంటిది కాదు.. తమ డిక్లరేషన్(Declaration) అంటూ కేటీఆర్( KTR)కు రేవంత్ రెడ్డి (Revanth Reddy)కౌంటర్ ఇచ్చారు.