ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కేసీఆర్ డబ్బులు పంచుతున్నారు: కిషన్ రెడ్డి
కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో అంతా కేసీఆర్ భజన తప్పా మరోటి లేదన్నారు. ప్లీనరీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత నుంచి వచ్చిన ప్రతీ మాటా అబద్దమే అన్నారు. పూనకం వచ్చినట్లు వ్యహరించి కేంద్రంపై విమర్శలు చేసిన కేసీఆర్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశంలో బీజేపీ లేకుండా చేస్తానని కేసీఆర్ అన్నారన్నారు. నీవు ఫ్రంట్ పెట్టుకో.. టెంట్ వేసుకో మాకు అభ్యంతరం లేదని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. కేసీఆర్ దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు. జాతీయ రాజకీయాల కోసం గతంలోనే కేసీఆర్ విమానాన్ని రెంట్‌కు తీపుకున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అసదుద్దీన్ ఓవైసీతో కలిసి తిరిగేందుకు కేసీఆర్ ప్లాన్ వేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
మరోవైపు మోడీ ప్రధాని అయ్యాక ఇతర దేశాల్లో భారతీయులకు గౌరవం పెరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయన్న కిషన్ రెడ్డి.. భారత్‌లో మాత్రమే చమురు ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. చాలా రాష్ట్రాలు చమురు ధరలపై వ్యాట్ తగ్గించాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెట్రో, డీజిల్‌పై వ్యాట్ తగ్గించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనాను సమర్థవంతంగా ఎదుర్కుందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ పింపిణీ చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.