KCR Comments: రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
KCR Comments: బిఆర్ఎస్ మీటింగ్ లో కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎంతకైనా తెగిస్తుందని పేర్కొన్న కేసీఆర్ మంత్రుల నుంచి స్టార్ట్ చేసి నా బిడ్డ వరకు వచ్చిందని అన్నారు. మమతా బెనర్జీ లాంటి వారినే కేంద్రం వేధించిందని పేర్కొన్నారు ఆయన. ఇక ఈ మీటింగ్ లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మా పొలిటికల్ గ్లామర్ పెరుగుతుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సర్వేలన్ని మాకు అనుకూలంగా ఉన్నాయన్న ఆయన వచ్చే ఎన్నికల్లో మాకు 103 సీట్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో బిజెపికి జీరో స్థానాలు…డిపాజిట్లు దక్కవు అని ఆయన అన్నారు. ఇక మరోపక్క వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. దళిత బంధు, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు నాకు సమాచారం ఉందన్న ఆయన ఇకపై అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని అన్నారు. పేద ప్రజలకు, ఆయా సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ఆదుకోండని అన్నారు. రేపు కవితను అరెస్ట్ చేయవచ్చని పేర్కొన్న ఆయన చేసుకుంటే చేసుకోనీ అని పేర్కొన్న ఆయన అందరినీ వేధిస్తున్నారని అయినా భయపడేది లేదు, పోరాటం వదిలేది లేదని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ లేకుండా చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.