Kanti Velugu: 100 రోజుల్లో పూర్తి కానున్న కంటి వెలుగు రెండో విడత – హరీశ్ రావు
Kanti Velugu second Phase in Telangana Started from January 18
తెలంగాణలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అయింది. ఖమ్మంలో సీఎం కేసీఆర్, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు, కేరళ సీఎంల సమక్షంలో కంటి వెలుగు కార్యక్రమం అధికారికంగా ప్రారంభం అయింది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో కంటివెలుగు ప్రారంభం అయింది.
15 వేల మంది సిబ్బంది కంటి వెలుగు విధుల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు 1500 స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కంటి వెలుగు పరీక్షలు ద్వారా 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
మంత్రులు హరీశ్ రావు, తలసాని అమీర్ పేటలోని కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు. గతంలో 8 నెలల్లో మొదటి విడత పూర్తి చేశామని, ఇప్పుడు వంద రోజుల్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పూర్తి కానుందని హరీశ్ రావు తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హరీశ్ రావు తెలిపారు.
కాలనీలకే కంటి వెలుగు బృందాలు వస్తాయని, చివరి మనిషి వరకు కంటి పరీక్షలు చేస్తామని మంత్రులు వెల్లడించారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి చాలని మంత్రలు భరోసా ఇచ్చారు. తెలంగాణలోని ప్రతి పథకం దేశానికే దిక్సుచి వంటిదని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను అనుసరిస్తున్నాయని మంత్రులు గుర్తుచేశారు.ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు వాళ్ల రాష్ట్రాల్లో కూడా కంటి వెలుగు అమలు చేస్తామని చెప్పారని హరీశ్ రావు గుర్తుచేశారు.
సంగారెడ్డిలోనే కంటి అద్దాలు తయారుకావడం ఈ సారి ప్రత్యేకమని, ఈ సారి మేడిన్ తెలంగాణ అద్దాలు పంపిణీ చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు.పార్టీలకు అతీతంగా కంటి వెలుగుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
20 లక్షల కళ్ళజోళ్ళు పంపిణీ చేసే అవకాశముంది. స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా అంత కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కంటి వెలుగును అభినందించారు. ఈ కార్యకమాన్ని తమ ప్రాంతల్లోనూ అమలు చేస్తామన్నారు.4/n
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) January 19, 2023
ప్రతి ఒక్కరి దగ్గరికి మా బృందాలు వెళ్తాయి.రాష్ట్ర వ్యాప్తంగా 16533 కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు నిర్వహించనున్నాం. గ్రేటడ్ కమ్యూనిటీ,అపార్ట్మెంట్ వాళ్ళు కావాలంటే జీహెచ్ ఎంసీ కి ట్విట్టర్, వెబ్ సైట్ లో రిక్వెస్ట్ పెడితే మీ దగ్గరికి కంటి వెలుగు బృందాలు వస్తాయి.2/n pic.twitter.com/duA68Da6Yf
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) January 19, 2023
సనత్ నగర్ నియోజకవర్గం అమీర్ పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాలులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం.
రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలు టెస్ట్‌లు చేస్తాయి. అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తాం @trsharish 1/n pic.twitter.com/AvA1j2aKXm
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) January 19, 2023
ఏ.వీ. కళాశాలలో నిర్వహిస్తున్న #కంటివెలుగు కార్యక్రమ శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి.#TelanganaKantiVelugu pic.twitter.com/kPRGfHMiT3
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) January 19, 2023
https://twitter.com/McPebbair/status/1615962037389230081?s=20&t=v_0XjDO22saJL0oDPtO4aA
Telangana: The Second Phase of Kanti Velugu, The World’s Largest Eye Screening Programme, was launched at the Newly Inaugurated INTEGRATED District Collectorate Complex at Khammam. pic.twitter.com/AjHmedYxTa
— PawanKTRS🐯 (@PA1KTRS) January 19, 2023
inauguration of kanti velugu Phase-II in Dornakal Municipality @KTRTRS @arvindkumar_ias @cdmatelangana @AclbMahabubabad pic.twitter.com/dtDKCFqBZa
— Mc_Dornakal (@mc_dornakal) January 19, 2023
Inauguration of Kanti Velugu Programme, a flagship programme by Govt of Telangana by Shri Boggarapu Dayanand Gupta,MLC and Pavan Naikoti, Corporator at Mahila Bhavan, Kothapet and attended by Varun Boggarapu, Dr Naresh , Vijay Ranga, Krishan Murthy and other Colony Members… pic.twitter.com/25JkrHDQgP
— Sharat Chandra Boggarapu (@SharatBoggarap) January 19, 2023
inauguration of kanti velugu Phase-II in Dornakal Municipality @KTRTRS @arvindkumar_ias @cdmatelangana pic.twitter.com/d5fcQHKkzF
— Mc_Dornakal (@mc_dornakal) January 19, 2023
A few more glimpses from the launch of 2nd phase #TelanganaKantiVelugu programme. pic.twitter.com/bc6W6mqF9F
— Telangana CMO (@TelanganaCMO) January 18, 2023