హైదరాబాద్ శివార్లలో చిరుత జనాన్ని భయపెడుతోంది.
Cheeta In City : హైదరాబాద్ (Hyderabad)శివార్లలో చిరుత (Cheeta)జనాన్ని భయపెడుతోంది. రెండు వారాల క్రితం ఔటర్ రింగ్ రోడ్డు (ORR)సమీపంలోని బౌరంపేట (Bowrampet)దగ్గర చిరుత సంచారంతో జనం వణికిపోయారు. నాలుగైదు రోజులు నిద్రలేకుండా గడిపారు. ఆ ఘటన మరవకముందే మేడ్చల్ (Medchel)జిల్లా (District)జీడిమెట్ల (Jeedimetla)పోలీస్ స్టేషన్ (Police Station)పరిధిలో చిరుత సంచరిస్తున్న వీడియో (Vedio)ఒకటి వైరల్గా మారింది. అపురూప కాలనీలో (Aproopa Colnet) చిరుత సంచరిస్తున్న వీడియో క్లిప్ (Vedio Clip) వైరల్ అయ్యింది. అర్ధరాత్రి కాలనీలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలను రికార్డు అయ్యాయి. దీంతో చిరుత ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని జనం వణికిపోతున్నారు.
అధికారులేమంటున్నారు?
చిరుత సంచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు కాలనీని సందర్శించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కాలనీ వాసులు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతలు పది రోజుల క్రితం బౌరం పేట ప్రాంతంలో సంచరించిన మాట వాస్తవమేన్నారు. చిరుత సంచరించిన చోట ఆనవాళ్లు సేకరిస్తున్నారు. అడుగులు పరిశీలించిన తర్వాత బంధించేందుకు ఏర్పాట్లపై తుది తీసుకుంటామని చెబుతున్నారు.
చిరుతా.. అడవి కుక్కా..
వీడియో టేపులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది చిరుత కాకపోవచ్చని కూడా కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోల్లో అడవికుక్క ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయని వివరించారు. అసలు ఈ వీడియో ఎక్కడిది, ఎవరు పోస్ట్ చేశారన్నవారిపై ఆరాతీస్తున్నారు. ప్రజలకు భయభ్రాంతులు చేసే వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.