Jagtial Collector: జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాపై ప్రశంసలు, ఎందుకో తెలుసా?
Jagtial Collector Yasmeen Basha presents silk cloths to Dharmapuri Lakshmi Narasimha Swamy
జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ముస్లిం అయిన ఆమె హిందు సాంప్రదాయాలను పాటించడంతో ఆమెపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలకు యాస్మిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి కలెక్టర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. హిందూ సంప్రదాయ పద్దతిలో నుదుట తిలకం దిద్దుకుని తలపాగా చుట్టుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముస్లిం అయినప్పటికీ హిందూ సాంప్రదాయాలను పాటించడంపై నెటిజన్లు యాస్మిన్ బాషాను అభినందిస్తున్నారు.
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మార్చి 3 రాత్రిన అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. హిందూ సంప్రదాయ పద్దతిలో నుదుట తిలకం దిద్దుకుని తలపాగా చుట్టుకున్న కలెక్టర్ ఆలయం చుట్టు ప్రదక్షిణలు కూడా చేశారు. తన భక్తిని చాటుకున్నారు. స్వామికి తలంబ్రాలు సమర్పించడంతో పాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలను కన్నులారా వీక్షించడానికి జగిత్యాల ప్రజలతో పాటు నిజామాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలైన నాందేడ్, నాగ్ పూర్, చంద్రాపూర్ నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వీలుగా నగరంలోని పలు ప్రాంతాల్లో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలోని శేషప్ప వేదికపై స్వామి వారి వివాహ వేడుకలు నిర్వహించారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాల యం లో బ్రహ్మోత్సవాల సందర్భంగా తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష. pic.twitter.com/u5JV2QjGWX
— Collector Jagtial (@Collector_JGTL) March 4, 2023
…