Jagadish Reddy Slams BJP and Etela Rajendar: నిన్న పలివెలలో జరిగిన ఘటనలో హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ కార్యకర్తలే ముందు దాడికి పాల్పడ్డారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఐటీ దాడులు జరిగింది….నా నా పిఏ పై కాదన్న ఆయన నా అనుచరుడిపై దాడులు జరిగాయని అన్నారు. ఇక ఈటెల రాజేందర్ ప్రభుత్వంపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని స్వయంగా ఈటెల రాజేందర్ చెప్పారని గుర్తు చేశారు. ఆయన కౌరవుల పక్కన ఉండి- ధర్మయుద్ధం గురించి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి పై బీజేపీ నాయకులు వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈటెల రాజేందర్ ధర్మం, భాష గురించి మాట్లాడి సానుభూతి పొందాలంటే సాధ్యం కాదని, టీఆరెస్ ప్రభుత్వాన్ని రెండేళ్లుగా ఈటెల రాజేందర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈటెల రాజేందర్ కంటే ముందు నుంచే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ బిడ్డ జగదీశ్వర్ పై దాడి చేశారని, గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కూడా దాడి చేశారని అన్నారు. పలివెలలో బీజేపీకి మెజారిటీ రాదని స్పష్టంగా తెలిసిపోయిందని అందుకే ఈ దాడులకు తెగబడ్డారని అన్నారు,
హింసను కేసీఆర్ ఎప్పుడూ ఇష్టపడరని అందరికీ తెలుసని, ప్రజలు లేకపోవడం వల్లనే బీజేపీ సభలను రద్దు చేసుకుందని అన్నారు. .ఏ క్షణంలో మాయమైపోతానోనని బీజేపీలో పెద్ద నాయకులే భయపడుతున్నారని, తెలంగాణలో ఉన్నంత స్వేచ్చాయుత వాతావరణం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. నాపై నిషేధం పెట్టినా…సానుభూతి కోసం నేను ప్రయత్నం చేయలేదన్న ఆయన ఎవరిపై ఐటీ దాడులకు పురికొల్పుతోందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మా పోలీసులు ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుల ఇళ్లలో సోదాలు చేయలేదని, బైక్స్ పై ఉన్న టీఆరెస్ కార్యకర్తలపై సడన్ గా బీజేపీ వాళ్ళు దాడి చేశారని అన్నారు. గతంలో బెంగాల్ లో ఇలానే దాడులు చేస్తే…ఎదురుదెబ్బ తగిలిందన్న ఆయన జరగబోయేది ధర్మయుద్ధం అందులో ధర్మమే గెలుస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండేళ్లుగా ఈటెల రాజేందర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాజకీయ ఘర్షణలు జరగలేదన్న ఆయన తెలంగాణ అభివృద్ధి జరగకపోతే గుజరాత్ ప్రజలు ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు.