Jagadish Reddy: ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో పైరవీలు అక్కర్లేదు!
Jagadish Reddy: ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో గవర్నర్ దగ్గర పైరవీలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గవర్నర్కు ఎవరూ బానిసలు కారని వ్యాఖ్యానించారు. పెండింగ్ ఫైళ్ల విషయంలో గవర్నర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధరలు పెంచడం బీజేపీ దుర్మార్గానికి పరాకాష్ట అని దీనిపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. నిజానికి ఈ పెండింగ్ బిల్లులు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన అడుగు సంచలనంగా మారగా ఈ పరిణామాలపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతి కుమారికి అధికారికంగా రాజ్ భవన్ కు వచ్చేందుకు సమయం దొరక లేదా అని ప్రశ్నించిన గవర్నర్ ఢిల్లీ కన్నా హైదరాబాద్ లోని రాజ్ భవన్ చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ పాటించలేదన్న ఆమె కనీస మర్యాద ఫాలో కాలేదని అన్నారు. స్నేహపూర్వక సమావేశాలు ఉపయోగకరంగా ఉండేవని కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ దిశగా కనీస ఆలోచన చేయ లేదని గవర్నర్ తమిళిసై అన్నారు. ఢిల్లీ కన్నా రాజ్ భవన్ దగ్గర అనే విషయం మరోసారి తెలంగాణ సీఎస్ కి గుర్తు చేస్తున్నానని గవర్నర్ ట్వీట్ చేశారు.