ఏపీ, తెలంగాణలో ఆదాయపు పన్ను అధికారుల దాడులు కలకం రేపుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన రియలెస్టేట్ సంస్థ కోహినూర్ గ్రూప్ తో పాటు మరో సంస్థపైనా ఐటి శాఖ అధికారులు దాడులు చేశారు.
IT Rides : ఏపీ, తెలంగాణ(AP Telangana)లో ఆదాయపు పన్ను అధికారుల దాడులు కలకం రేపుతున్నాయి. హైదరాబాద్ (hyderabad)కు చెందిన రియలెస్టేట్ సంస్థ కోహినూర్ గ్రూప్ (Kohinoor Group) తో పాటు మరో సంస్థపైనా ఐటి (IT)శాఖ అధికారులు దాడులు చేశారు. ఏకకాలంలో 30 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలు పాల్పడ్డారని ఆరోపణలతో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోహినూర్ గ్రూప్ రియలెస్టేట్ బిజినెస్ (business)చేస్తోంది. ఈ సంస్థకు చెందిన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ మజిద్ తో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఓ రాజకీయ నాయకుడికి ఈ సంస్థ బినామీగా వ్యవహరిస్తోందని ఆదాయపు పన్ను శాఖ అధికారుల అనుమానం. గుడిమల్కాపూర్ లోని కోహినూర్ క్లాసిక్ టవర్ లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో రెండు ఐటి శాఖ టీమ్లు సోదాలు చేస్తున్నాయి.
It Rides
విశాఖపట్టణంలోనూ
విశాఖలో సైతం ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. పలు ఫార్మా కంపెనీలు, వాటి డైరక్టర్ల ఇళ్లలో సోదాలు ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో పదికి పైగా చోట్ల సోదాలు జరుగుతున్నాయి. విశాఖలో 15 ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి