Governor Tamilisai: కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి రావడం అసాధ్యం: గవర్నర్ తమిళి సై
Key remarks by Governor Tamili Sai: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న కేసీఆర్‌కు అది సాధ్యం కాదన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లే సమయంలో తమిళి సై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని గవర్నర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారన్నారు.
ఇక తనకు తెలంగాణ ప్రభుత్వంతో కొనసాగుతోన్న దూరంపై కూడా తమిళిసై స్పందించారు. తాను గవర్నర్‌గా ప్రోటోకాల్‌ను ఆశించడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఇటీవలే రాజ్ భవన్‌కు వచ్చి వెళ్లాక కూడా తన ప్రోటోకాల్‌లో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ గవర్నర్ తెలిపారు. తాను ఇటీవల భద్రాచలం వెళ్లినా తన వద్దకు ప్రభుత్వ అధికారులు ఎవరూ రాలేదని తమిళి సై అన్నారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు, వారికి దక్కుతున్న ప్రోటోకాల్‌తో నేను పోల్చుకోనని తమిళి సై అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండటమే తన నైజమని గవర్నర్ వ్యాఖ్యానించారు.