Indrakaran Reddy: దమ్ముంటే డబ్బులు తీసుకున్నది ఎవ్వరో పది రోజుల్లో రుజువు చెయ్!
Indrakaran Reddy Challenge to Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ విసిరారు. డబ్బులు ఎవరు తీసుకున్నారో వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, చిట్టా తీసుకో.. ఏమైనా తీసుకో, దమ్ముంటే డబ్బులు తీసుకున్నది ఎవ్వరో పది రోజుల్లో రుజువు చేయమని అన్నారు. గుజరాత్ కు ఒక నీతి తెలంగాణ కు ఒక నీతా? కేంద్రం వివక్ష చూపిస్తుందన్న ఆయన బీఆర్ఎస్ పెడితే బీజేపికి వణుకు మొదలైందని అన్నారు. ఇక బండి సంజయ్ కోసం పిచ్చి ఆసుపత్రి రెడీ గా ఉందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతకు ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మంత్రి అవినీతి చిట్టా మొత్తం సిద్ధంగా ఉందని.. మున్సిపల్ స్కామ్‌లో తిన్నదంతా కక్కిస్తామని మంత్రికి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మీడియా ముందు పిచ్చి పిచ్చిగా వాగితే తాటతీస్తా అని హెచ్చరించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతికి సహకరించిన కలెక్టర్ జాగ్రత్తగా ఉండాలని.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి, అతని అల్లుడు కబ్జాలకు… అంతే లేదని, మంత్రి పై విచారణ జరపాల్సిందే, విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. రోజుకు లక్ష రూపాయలు పోలీసులు చలాన్ పేరు మీద వసూలు చేయాలంట ఇదెక్కడి రూల్ అని ప్రశ్నించారు. ఇక్కడి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నానని, నిర్మల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్మల్ సంగతేంటో… నేనే చూస్తానని అన్నారు. టీఆర్ఎస్ నేతలు గుంటనక్కల్లా కబ్జాలు చేసి, వేల కోట్లు దండుకుంటున్నారని ఆయన అన్నారు.