తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంపు
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచింది తెలంగాణ సర్కార్.. టీఎస్ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ప్రతిపాదించిన నివేదికను ఈఆర్సీ ఆమోదించింది. ఈఆర్సీ నిర్ణయంతో రాష్ట్రంలో 14 శాతం ఛార్జీల పెంచినట్లైంది. దీంతో రాష్ట్రంలో గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు 1 రూపాయి చొప్పున ఛార్జీలు పెంచింది ప్రభుత్వం. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
రాష్ట్రంలో రెవెన్యూ లోటును పూడ్చేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10.928 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా.. దానిని పూడ్చే దిశగా ముందడుగు వేసింది. గత ఐదేళ్ళలో విద్యుత్ ఛార్జీలు పెంచని ప్రభుత్వం.. రెవెన్యూ లోటు అధికం అవుతుండటంతో తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంది.