తెలంగాణ లో ఎక్కడ కూడా 12- 13 గంటల కంటే కూడా ఎక్కువ కరెంట్ ఇవ్వడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ఈ 12, 13 గంటల కరెంటులో కూడా కోత ఉంటుందన్నారు. తెలంగాణ రైతులకు ఇక కరెంట్ కోతతో ఇబ్బంది తప్పేలా లేదని ఆయన మండిపడ్డారు.
Komati Reddy Venkat Reddy:తెలంగాణలో కరెంట్ కోతల గురించి.. కేసీఆర్ ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) మరోసారి వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ (CM KCR) ఏ పర్యటనకు వెళ్లినా..అక్కడ 2, 3 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా? లేక 24 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా అని ప్రజలను ప్రశ్నిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.
అసలు తెలంగాణలో ఎక్కడ కూడా 12- 13 గంటల కంటే కూడా ఎక్కువ కరెంట్ ఇవ్వడం లేదని ఎంపీ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ 12, 13 గంటల కరెంటులో కూడా కోత ఉంటుందన్నారు. తెలంగాణ రైతులకు ఇక కరెంట్ కోతతో ఇబ్బంది తప్పేలా లేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికీ తన వద్దుకు నల్లగొండ మండలం నుంచి కరెంట్ కోతపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. నల్లగొండ మండలం అప్పాజీపేటలో అయితే వారం రోజుల నుంచి 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. పొలాలు ఎండిపోతున్నాయని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎంపీ చెప్పారు.
24 గంటలు ఇచ్చేటంత కరెంట్.. తెలంగాణ సర్కార్ దగ్గర ఉందా అని ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy)..ఒకవేళ సరిపడినంత లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కొని ఇక్కడ ప్రజలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు నెలల తర్వాత అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా ఆయన వ్యక్తం చేశారు.