తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని .. బీజేపీ(BJP) నుంచే పోటీ చేస్తానని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు తన ప్రాణాలు పోయినా కూడా సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ పార్టీ(Congress party )లో ఎప్పటికీ చేరనంటూ చెప్పుకొచ్చారు.
Rajasingh : బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) త్వరలోనే పార్టీ మారబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై స్పందించిన రాజాసింగ్.. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని .. బీజేపీ(BJP) నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు తన ప్రాణాలు పోయినా కూడా సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ పార్టీ(Congress party )లో ఎప్పటికీ చేరనంటూ చెప్పుకొచ్చారు.
సరైన సమయంలో తనపై బీజేపీ అధిష్ఠానం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తుందని రాజా సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ అలా జరగకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. కనీసం స్వతంత్ర అభ్యర్థిగా కూడా తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. అంతేకాదు..తెలంగాణ హిందూ రాష్ట్రం అయ్యేందుకు తాను పని చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించిన రాజాసింగ్.. వారి నిర్ణయం కోసం ఆ టికెట్ పెండింగ్ పెట్టారన్నారు.