నేను పదవుల కోసం పని చేసే వ్యక్తిని కాదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కొత్తతరం నాయకులను ప్రోత్సహించాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాను పదవుల కోసం పని చేసే వ్యక్తిని కాదన్న వెంకట్ రెడ్డీ.. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పనిచేస్తానన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం గొడవ జరుగుతుందన్న ఎంపీ… సీఎం నేరుగా ప్రధానితో భేటీ అయితే సమస్య కొలిక్కి వస్తుందన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు.
కొత్త ఫార్మాసిటీలో భూములు కోల్పోయే రైతులకు అండగా ఉంటానన్నారు. ఫార్మా సిటీకి భూములను ఎంతకు అమ్ముతున్నారో రైతుకు అంత డబ్బు ఖచ్చితంగా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కాలుష్యం మనకు.. కొలువులు ఆంధ్రా వాళ్లకు అన్నట్టు ఉండొద్దన్నారు. ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతుల పక్షాన నిలబడి తాను పోరాటం చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ క్రమంలో రాజమౌళి.. రామారావు.. రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ కొత్త రికార్డుల వేట షురూ చేసింది.. ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఓవర్ సీస్ ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఇప్పటికే రెండు మిలియన్స్ క్రాస్ చేసిందట. దాదాపు మూడు మిలియన్ డాలర్స్‌కు చేరువలో ఉందని టాక్. ఇక విడుదల సమయానికి మూడు మిలియన్స్ క్రాస్ చేయడం ఖాయమంటున్నారు సీని విశ్లేషులు.. అంటే… కేవలం ప్రీమియర్స్ పరంగా ఇప్పటికీ రూ. 20 కోట్లు వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తోంది.. విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ఈ స్థాయిలో రాబట్టడం ఫస్ట్ రికార్డ్.. ఈ రికార్డ్ సాధించిన తొలి సినిమా కూడా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం.
అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రాన్ని డీవీనీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్స్.. సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించాయి.. ఇక ఇటీవల విడుదలైన ఎత్తర జెండా సాంగ్ యూట్యూబ్‍ను షేక్ చేస్తోంది.