Hyderabad: బైకో, కారో లేకపోతే హైదరాబాద్ రోడ్లపై నడవటం ఎంత కష్టమో..రోడ్డు దాటటం కూడా అంతే కష్టం. బీజీ రోడ్లపై అటు నుంచి ఇటు వెళ్లలేక చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. రెట్టింపవుతున్న వాహనాలను దాటుకుని సిగ్నల్ లేని చోట్ల రోడ్డు దాటటం చాలా కష్టమైన పని. ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ట్రాఫిక్ పోలీసులు పరిష్కారం కనుగొన్నారు.
Hyderabad: బైకో, కారో లేకపోతే హైదరాబాద్ రోడ్లపై నడవటం ఎంత కష్టమో..రోడ్డు దాటటం కూడా అంతే కష్టం. బీజీ రోడ్లపై అటు నుంచి ఇటు వెళ్లలేక చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. రెట్టింపవుతున్న వాహనాలను దాటుకుని సిగ్నల్ లేని చోట్ల రోడ్డు దాటటం చాలా కష్టమైన పని. ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ట్రాఫిక్ పోలీసులు పరిష్కారం కనుగొన్నారు.
లాంఛనంగా ప్రారంభించిన సిటీ కమిషనర్
సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీసులు కలిసి నగరంలోని పలు చోట్ల పెలికాన్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ ఏరియాలో ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు.
ఫెలికాన్ సిగ్నల్స్ అంటే…
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర్లో ఏర్పాటు చేసిన ఓ మెషిన్ ఇది. ఆ మెషిన్‌పై ఉన్న బటన్ నొక్కగానే అప్పటి వరకు గ్రీన్‌గా ఉన్న సిగ్నల్ రెడ్‌కు మారుతుంది. పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా ఇది 15 సెకన్ల పాటు ఉంటుంది. ఈ సమయం పూర్తికాగానే దానంతట అదే వాహనాలకు గ్రీన్ సిగ్నల్ చూపుతుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్లు బటన్ నొక్కుండా.. ప్రతీ సిగ్నల్ వద్ద ఒక వలంటీర్‌ను నియమించారు స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ వద్ద ఉండే ప్రధాన కూడళ్లలో ఈ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం.. ట్యాంక్‌బండ్ మైత్రీవనం, అమీర్‌పేట్ క్రాస్‌రోడ్స్, బొటానికల్ గార్డెన్ సిగ్నల్, గచ్చిబౌలి, మాదాపూర్, శిల్పారామం జంక్షన్ వంటి ప్రధాన జంక్షన్లలో ఈ తరహా సిగ్నల్స్ ఉన్నాయి.
ఫెలికాన్ సిగ్నల్స్
వీటికి అదనంగా 155 ట్రాఫిక్, 100 ఫెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక నూతనంగా హైదరాబాద్ పరిధిలో 80, సైబరాబాద్ పరిధిలో 50, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 ట్రాఫిక్ సిగ్నళ్ల పనులను అధికారులు చేపట్టారు. కెనడాకు చెందిన ఐబీఐ గ్రూప్‌కు ఈ ప్రాజెక్టు పనుల బాధ్యతలను అప్పగించారు. రహదారి భద్రతా చర్యల్లో భాగంగా ట్రాఫిక్ సూచికల బోర్డులను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు వ్యూహం
హైదరాబాద్‌లో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా ట్రాఫిక్ జంక్షన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 221 ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు నూతనంగా 155 ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.59 కోట్లను ఖర్చు చేయనున్నది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికల్లా ఈ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 221 చోట్ల ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. హైదరాబాద్ పరిధిలో 155, సైబరాబాద్ పరిధిలో 41, రాచకొండ పరిధిలో 25 ట్రాఫిక్ కూడళ్లు ఉన్నాయి. వీటికి సాంకేతికత జోడించి, ఆటోమెటిక్‌గా పని చేసేలా జీహెచ్ఎంసీ అధికారులు చూస్తున్నారు.