BRS Khammam meeting: రేపే హైదరాబాద్ కు ముగ్గురు సీఎంలు.. షెడ్యూల్ ఇదే!
Huge arrangements for BRS Khammam meeting: ఖమ్మంలో ఈనెల 18వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ సభ కోసం రేపు రాత్రికి హైదరాబాద్ కి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు రానున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో భారీ బహరింగ సభను బీఆర్‌ఎస్ పార్టీ కనివినీ ఎరగని స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ దేశం అంతా బీఆర్ఎస్ పేరు వినిపించేలా ఏర్పాట్లు చేస్తోంది. సభకు ఇంకా రెండు రోజులు ఉండగానే భారీ కటౌట్లు, హోర్డింగ్ లతో ఖమ్మం అంతా గులాబి మయమైంది. బీఆర్‌ఎస్ పార్టీగా అవవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఏర్పాట్లు భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎల్లుండి ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతల చర్చలు జరపబోతున్నారు. ఆ తరువాత రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి ముగ్గురు సీఎంలు, జాతీయ నేతలు వెళ్లనున్నారు. యాదాద్రి దర్శనం తర్వాత..ఖమ్మం వెళ్లనున్నారు సీఎంలు. ఖమ్మం కలెక్టరేట్ లో రెండో విడత కంటి వెలుగు ప్రారంభం తర్వాత కలెక్టరేట్ లో నలుగురు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేయనున్నారు.