మంత్రి పువ్వాడ అజయ్‌కి హైకోర్టు నోటీసులు
సాయి గణేష్ ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. పువ్వాడతో పాటు మరో 8 మందికి ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వాలని కోర్టు వారిని ఆదేశించింది. సాయి గణేష్ ఆత్మహత్య పిటీషన్‌ను విచారించిన ధర్మాసనం అనంతరం ఈ విచారణను ఏప్రిల్ చివరి నాటికి వాయిదా వేసింది. ప్రభుత్వం సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
అంతకు ముదు సాయి గణేష్ ఆత్మహత్యపై బీజేపీ శ్రేణులు హై కోర్టును ఆశ్రయించారు. మంత్రి పువ్వాడ అజయ్ సాయి గణేష్‌పై కక్ష పెంచుకొని అతనిపై లేనిపోని కేసులు పెట్టించారని, పోలీస్ స్టేషన్‌లో పోలీసులు సాయి గణేష్‌ను చిత్రహింసలు పెట్టారని, పోలీసుల వేధింపులు తాళలేకే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు కోర్టుకు తెలిపారు