ఇప్పటికే దేశం ఎండలతో ఉడికిపోతోంది. అనేక చోట్ల 46 డిగ్రీలకుపైగా ఎండలు నమోదవుతున్నాయి. ప్రజలు ఎండ వల్ల వడదెబ్బ, ఉక్కపోత వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
Temperatures: ఇప్పటికే దేశం ఎండలతో ఉడికిపోతోంది. అనేక చోట్ల 46 డిగ్రీలకుపైగా ఎండలు నమోదవుతున్నాయి. ప్రజలు ఎండ వల్ల వడదెబ్బ, ఉక్కపోత వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్య పనులుంటేనే బయటకు వెళ్తున్న ప్రజలు, సూర్యుని ప్రచండతతో మరింత భయపడిపోతున్నారు. ముఖ్యమైన పనులమీద బయటకు వచ్చిన వారు పార్కుల్లోనూ, చెట్ల నీడన సేద తీరుతున్నారు.
ఉదయం 9 నుంచి 4.00 మధ్య బయట కాలు పెట్టాలంటే జంకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎండల ఫలితంగా రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో ఏడుగురు మృతిచెందారు. భద్రాద్రి జిల్లా లో 46.4, గరిమెళ్లపాడులో 45.4, ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖానాపురం పరిధిలో 45.4, లింగాలలో 44.7, పాల్వంచలో 44.5, ఖమ్మం ఎన్నెస్పీ ప్రాంతంలో 44.4 , 45.3, సూర్యాపేట, జయశంకర్-భూపాలపల్లిలో 44.9, పెద్దపల్లి 44.6, యాదాద్రి భువనగిరి 44.4, మహబూబాబాద్ లో 44.2, ములుగు 44.1, మంచిర్యాల జిల్లా 44.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఓ పక్క విపరీతమైన ఉక్కబోత ఉండడంతో ప్రజలు అపసోపాలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది.నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని ప్రకటించింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు. నీరు ఎక్కువగా తీసుకోవాలని, పిల్లలు, వృద్దులు ,గర్భిణీలు, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రయాణాలు వాయిదావేసుకుంటే మంచిదని ప్రజలకు సూచిస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ లో ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 – 45 ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 – 44ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా ఏర్పేడులో 46 పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45.9 అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 – 44 ల వరకు.. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 – 44ల వరకు.. అలాగే .శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 – 42 ల వరకు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 – 40 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.