తెలుగు రాష్టాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Heat Wave: తెలుగు రాష్టాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. జనాలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని వీణవంక, నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారంలో 44.9, సూర్యాపేట జిల్లా మోతెలో 44.8, గరిడేపల్లిలో 44.8, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 44.5, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో 44.5, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 44.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 44.5, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 44.5, గా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతోంది. మరో రెండు నుంచి మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. నంద్యాల జిల్లా డోర్నిపాడు, నెల్లూరులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని వెల్లడించింది. శ్రీకాకుళంలో 42.8 డిగ్రీలు, బాపట్లలో 42.7, అనంతపురంలో 42.5, తిరుపతిలో 42.4, కర్నూలు, అన్నమయ్య జిల్లా, ఆళ్లగడ్డ, మహానంది, కడప జిల్లాలో 42.5, ప్రకాశం జిల్లాలో 42.4, పల్నాడు జిల్లాలో 41.8, గా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణశాఖ వెల్లడిస్తుంది. తెలంగాణలో వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది మరణించారు. ఏపీలో 10 మంది వడదెబ్బకు ప్రాణాలు వదిలారు.