YS Sharmila: ఆంధ్రులను అణిచివేసిన కేసీఆర్.. వరద తెచ్చిన కష్టాలను తట్టుకోలేక పోతున్నాడు: షర్మిల
Ys sharmila Comments on cm kcr: సీఎం కేసీఆర్పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రోళ్లను అణిచివేసిన కేసీఆర్.. ప్రతిపక్షాల పన్నాగాలును కూడా అణిచేవేశారన్నారు. తిరుగు బాటు దారులను వెన్నుపోటు పోడిచారన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీల జమ్మిక్కులు కూడా అయిపోయాయన్న షర్మిల.. ఆయన కేంద్ర ప్రభుత్వంపై నిర్లక్ష్యంగా వ్యహరించారని గుర్తు చేశారు. ఇదంతా యి
సీఎం కేసీఆర్పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రోళ్లను అణిచివేసిన కేసీఆర్.. ప్రతిపక్షాల పన్నాగాల పని పట్టారన్నారు. తిరుగుబాటు దారులను వెన్నుపోటు పొడిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీల్లో జిమ్మిక్కులు చెద్దామనుకున్నారు కానీ అది కుదరలేదని ఎద్దేవా చేశారు. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న కేసీఆర్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకోవడంలేదన్నారు.
ప్రస్తుతం కేసీఆర్ కన్ను విదేశాలపై పడినట్లుందని షర్మిల ఎద్దేవా చేశారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో వరదలు రావడంతో కేసీఆర్ తెలంగాణపై అంతర్జాతీయంగా కుట్రలు చేస్తోన్నారని అనడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా సబబుకాదన్నారు. రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాల వరకు అన్నింటినీ ముందుండి ఎదుర్కున్న సీఎం దొరకు ఒక్క వరద ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టిందని షర్మిల సోషల్ మీడియాలో వెళ్లడించారు. భారీ వరదలతో కేసీఆర్ మైండ్ బ్లాకైందన్నారు. అందుకే సీఎంకు ఏం మాట్లాడాలో తెలియక అంతర్జాతీయ కుట్రలు అంటున్నారని మండిపడ్డారు.