V Hanmantha Rao: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా లో ఈ యాత్ర కొనసాగుతుంది. రాత్రి పాదయాత్రను ముగించే సందర్భంగా జిల్లా పరిధిలోని అందోల్ లో బహిరంగ సభను జరిగింది. అందోల్ సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు సంబరాలు చేసుకున్నారు.
రాహుల్ ప్రసంగం ముగియగానే సంతోషం పట్టలేక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పక్కనే ఉన్న నేతలతో కలిసి డాన్స్ వేశారు. దామోదరను స్టెప్పులను చూసిన సీనియర్ నేత వి.హన్మంతరావు తన వయసును సైతం లెక్క చేయకుండా డ్యాన్స్ చేశారు. ఇద్దరు కీలక నేతలు స్టేజీ మీదే మైమరచి స్టెప్పులేస్తున్న వైనం చూసి పార్టీ కార్యకర్తలు హుషారుగా కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ డాన్స్ కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ నెల 07 తో రాహుల్ యాత్ర తెలంగాణాలో పూర్తి అవుతుంది. ఆ తర్వాత మహారాష్ట్ర లో యాత్ర కొనసాగించబోతున్నారు. ఈ క్రమంలో భారీ వీడ్కోలు సభ ఏర్పాటు చేయబోతుంది టీ కాంగ్రెస్.
#BharatJodaYatra में,कल देर शाम,आंदोल वि. सभा, तेलंगाना में जनसभा का आयोजन किया गया।
श्री @RahulGandhi जी के भाषण के बाद माहौल इतना ख़ुशगवार था कि राज्य के पूर्व DY CM श्री @CilarapuDamodar पूर्व प्रदेश कांग्रेस अध्यक्ष श्री @vhrcongress जैसे वरिष्ठ नेता पूरी जनता के साथ झूम उठे। pic.twitter.com/mVrIUDyQgd— Nadeem Javed (@nadeeminc) November 4, 2022