ఏపీ మాకు దూరం తెలంగాణలో కలిపేయండి
Governor Tour in Bhadrachalam : ఐదు గ్రామాలను తెలంగాణ (Telangna)లో విలీనం చేయాలని ఏపీ (AP)లో విలీనమైన ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ (Governor)తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలం (Bhadrachalam)లో గిరిజనులతో ఆరోగ్య (Helth) రక్షణ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తమపట్నం, ఎటపాక, పిచుకుల పాడు, కన్నాయిగూడెం, గుండాలకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో గవర్నర్ను కలిశారు. తాము ఏపీలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని,, ఏపీ చాలా దూరంగా ఉందని.. అందువల్ల తమను తెలంగాణ ప్రాంతం అయిన భద్రాచలంలో కలపాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఐదు గ్రామాల ప్రజల పరిస్థితి విన్నానని.. ఈ సమస్య పరిష్కారం కోసం తాను కేంద్ర (Center), రాష్ట్ర (State)ప్రభుత్వాలతో మాట్లాడతానన్నారు.
ఆరోగ్యమే ప్రధానం
ఆదివాసీల సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా.. అభివృద్ధి చే అందరం కలిసి పనిచేయాల్సి ఉందన్నారు గవర్నర్ తమిళిసై.. తన వంతుగా రాజభవన్ నుండి మీ ఆరోగ్య రక్షణకు అంబులెన్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఎవరు అభివృద్ధి చెందాలన్నా.. విద్య చాలా అవసరమని, ఆదివాసి పిల్లలకు నేటి వరకు నాణ్యమైన విద్య అందుబాటు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఆదివాసీలు ఎదగడానికి విద్యే ముఖ్యమని, వారికి ఆరోగ్యం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయిందని తెలిపారు. సరైన పోషకాహారం అందటం లేదని, వారికి నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు చేపడతానని హామీనిచ్చారు.
బిజీ టూర్
ఇక, భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్బంగా గిరిజనులతో మమేకం అయ్యారు. గిరిజనుల యువతులతో కలసి నృత్యం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కర్తవ్యంగా కృషి చేస్తానని చెప్పారు. ఇక్కడ ఉన్న ఐదు విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని తన దృష్టికి తీసుకొచ్చారు.. వారికి వైద్యం, ఇతరాత్ర సదుపాయాల గురించి తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడ
తీసుకెళ్తానని తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.