Rain Effect: విద్యాలయాలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగించిన ప్రభుత్వం
Schools will Start From July 18: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలో విద్యా సంస్థలసెలవులపు పెంచింది టీఆర్ఎస్ సర్కార్. మరో 3 రోజుల పాటు సెలవులు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా ఈ సెలవులను మరో 3 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వ తాజా ప్రకటనతో రాష్ట్రంలో విద్యాలయాలు ఈ నెల 18న పునఃప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఈ నెల 16 వరకే విద్యాలయాలకు సెలవులు ఉండగా.. 17న ఆదివారం కావడంతో పాఠశాలలు ఈ నెల 18న పునఃప్రారంభం కానున్నాయి. మొత్తంగా వర్షాల కారణంగా ఈ వారం మొత్తం పాఠశాలలు తెరచుకోలేదు.
గత శనివారం పని చేసిన పాఠశాలలు ఆదివారం సెలవుతో తిరిగి సోమవారం ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా 3 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. బుధవారంతో సెలవులు ముగియనుండడంతో.. ప్రభుత్వం మరో 3 రోజుల పాటు సెలవులను పొడిగించింది. వెరసి తెలంగాణలో వరుసగా 8 రోజుల పాటు విద్యాలయాలు మూపడిపోయినట్టైంది.