Governer Tamilisai: కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Governer Tamilisai Comments: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ వ్యవస్థ ను అవమానించారని పేర్కొన్న ఆమె ఏడాది నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదని అన్నాడు. అసలు ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్ వ్యవస్థలను ఎలా అవహేళన చేస్తారు? అని ఆమె ప్రశ్నించారు. ప్రోటోకాల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని అన్నారు. నేను 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా- ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసని ఆమె అన్నారు. రిపబ్లిక్ డే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదని ఆమె పేర్కొన్నారు. అసలు గణతంత్ర దినోత్సవం, బడ్జెట్ సమావేశాలు రానున్నాయి ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో మీరు చూస్తారుగా అంటూ ఆమె పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. గత కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వం -తెలంగాణ గవర్నర్ మధ్య దూరం దూరం అంతకంతకూ పెరుగుతోంది.