బీజేపీలో చేరేందుకు కృష్ణారావు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీజేపీలోకి కృష్ణాయాదవ్ చేరిక ఆగిపోయింది. చివరి నిమిషంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన చేరికను వాయిదా వేశారు.
BJP: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నేతలు పార్టీలు మారుతూ హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని ఆశించిన కొందరు నేతలకు కేసీఆర్ మొండిచేయి చూపించడంతో పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కృష్ణాయాదవ్ కూడా బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు. అనంతరం రెండు, మూడు రోజుల్లో బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు కృష్ణాయాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా అంబర్‌పేట నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.
ఇక బీజేపీలో చేరేందుకు కృష్ణాయాదవ్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీజేపీలోకి కృష్ణాయాదవ్ చేరిక ఆగిపోయింది. చివరి నిమిషంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన చేరికను వాయిదా వేశారు. పలు పరిణామాల వల్ల ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చింది. అలాగే కృష్ణాయాదవ్ తనను సంప్రదించకుండా.. ఈటల రాజేందర్‌ను కలవడంతో కిషన్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. దీనికి తోడు తన సొంత నియోజకవర్గమైన అంబర్‌పేట నుంచి కృష్ణాయాదవ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో కిషన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఆయన చేరికను వాయిదా వేశారు.
వేములవాడ టికెట్ హామీతో మాజీ గవర్నర్ విద్యాసాగరరావు కొడుకు వికాస్ రావు బీజేపీ కండువా కప్పుకున్నారు. కానీ ఆ టికెట్‌ను ఈటల వర్గానికి చెందిన తుల ఉమ ఆశిస్తున్నారు. అటు కిషన్ రెడ్డి వికాస్ రావుకు మద్ధతు ఇస్తుంటే.. ఈటల మాత్రం ఉమకు జై కొడుతున్నారు. అటు వికాస్ రావు బీజేపీలో చేరిన కార్యక్రమానికి కూడా ఈటల రాజేందర్ హాజరు కాలేదు. దీనితో పాటు పలు పరిణామాల దృష్ట్యా ఈటల, కిషన్ రెడ్డిల మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.