Gangavva: గంగవ్వ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది – రేవంత్ రెడ్డి
Gangavva meets Revanth reddy and gifts Mirchi bajji
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిను బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వను కలిసింది. రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మిర్చి బజ్జీలను అందించింది. గంగవ్వ తన కోసం తయారు చేసిన మిర్చి బజ్జీలను రేవంత్ రెడ్డి ఎంతో ఇష్టంగా ఆరగించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన తల్లిని గుర్తుచేసిన గంగవ్వను తాను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు.
గంగవ్వ! తెలంగాణకు పరిచయం అక్కరలేని అవ్వ… ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నా కోసం ఆప్యాయంగా… నాకిష్టమైన మిర్చీ బజ్జీ తెచ్చి… తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. “యాత్ర”లో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా… నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించే వాడిని. తల్లిని గుర్తు చేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. అని రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు.
గంగవ్వ యూ ట్యూబ్ వీడియోల ద్వారా బాగా పాపులారిటీ సాధించింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ వంటలు చేసే కార్యక్రమం ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరయింది. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా కొన్ని రోజుల పాటు పాల్గొన్ని మరింత పాపులారిటీ సంపాదించింది. సెలబ్రిటీగా మారిపోయింది.
గంగవ్వ! తెలంగాణకు పరిచయం అక్కరలేని అవ్వ… ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నా కోసం ఆప్యాయంగా… నాకిష్టమైన మిర్చీ బజ్జీ తెచ్చి… తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది.
“యాత్ర”లో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా… నా అనుభవాలను నా… https://t.co/RhGWi0YnDv pic.twitter.com/xyxokggNqz— Revanth Reddy (@revanth_anumula) March 7, 2023
#Gangavva met @revanth_anumula during his Yatra in Jagtial district pic.twitter.com/UzRtkELpAd
— B Kartheek (@KartheekTnie) March 6, 2023