హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్
హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ కలకలం రేగింది. నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. జూబ్లీహిల్స్ వెళ్తున్న యువతిని కోటీ వద్ద ఆటో ఎక్కించుకున్నాడు ఆటో డ్రైవర్. మార్గ మధ్యలో తన స్నేహితులకు ఫోన్ చేశాడు. జిల్లెలగూడలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు యువకులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
తెరుకున్న తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ఆస్పత్రి తరలించారు. నిందితులు అఖిల్, నితిన్, ప్రశాంత్, శ్రీనుగా గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.