తెలంగాణ పంచాయతీలకు నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల 769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా దాదాపు అన్ని గ్రామాల్లో సర్పంచ్ లు ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసారు.
Telangana Panchayats: తెలంగాణ పంచాయతీలకు నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల 769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా దాదాపు అన్ని గ్రామాల్లో సర్పంచ్ లు ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, రైతువేదికలు తదితర అభివృద్ధి పనులకు సొంత డబ్బును పెట్టి అభివృద్ధి పథంలో పల్లెలను తీర్చి దిద్దారు. ఇందుకు సంబంధించిన బిల్లులు దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. పంచాయతీ అకౌంట్లలో పైసలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం ఫ్రీజింగ్ చేసింది. దీంతో సర్పంచ్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కొన్ని చోట్ల ఆస్తులు తాకట్టు పెట్టి సర్పంచ్ లు పనులు చేయించారు. ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు రిలీజ్ కాకపోవడంతో మహిళల మేడలో పుస్తెల తాడు అమ్మి.. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టామని సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే తరుణంలో పలు పంచాయతీలు ఇప్పటికే జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నాయి. అవార్డు అందుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేసినందుకు బిల్లులు రాలేదని సర్పంచులు గగ్గోలు పెట్టారు. కొందరైతే వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు తెలంగాణ సర్పంచులందరికి శుభవార్తను తెలిపింది ప్రభుత్వం.
తెలంగాణ గ్రామ పంచాయతీలకు శుభవార్త తెలిపింది కేసీఆర్ సర్కార్. మొత్తం పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలనీ సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదే తరుణంలో సీఎం కేసీఆర్ తో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ప్రత్యేకంగా సమావేశమై పెండింగ్ బిల్లులపై చర్చించినట్టు సమాచారం. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే నిధులను విడుదలచేయాలని ఆర్థికశాఖ కు సూచించారు. ఏకంగా 1190 కోట్లు విడుదల విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి ప్రగతి పనులు పల్లెల్లో పరుగులు పెట్టనున్నాయి. సీఎం నిర్ణయానికి సర్పంచులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.