గాంధీనగర్ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని టింబర్ డిపోలో తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. ఈ ప్రమాదంలో డిపోలో ఉన్న 11 మంది సజీవ దహనం అయ్యారు. టింబర్ డిపొలో మంటలు చెలరేగుతుండటాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాని చేరుకున్న ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్లే జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదంపై సీపీ సీవీ ఆనంద్ ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన గంటకే పోలీస్ స్టేషన్‌కు ఫోన్ వచ్చిందని ఆనంద్ తెలిపారు. సెంట్రల్ జోన్ పోలీసులు అక్కడికి వెళ్లే సరికి డిపో కాలిపోయినట్లు తెలిపారు. మృతులంతా బీహార్‌కు చెందినవారుగా సీపీ తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై సీఎం స్పందించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.