Manickam Tagore: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు.. అధిష్టానానికి మాజీ ఇంచార్జ్ కీలక రిపోర్ట్!
Manickam Tagore Final Report on T Congres: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ మాజీ ఇన్చార్జి మాణికం ఠాగూర్ కుమ్మక్కు అయ్యారని, రేవంత్ కు అయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ముందు నుంచి కాంగ్రెస్ సీనియర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు భారత రాష్ట్ర సమితితో అవగాహనకు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఓ టెలివిజన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడంతో ఈ చర్చ మొదలైంది. ఈ విషయాన్ని మాణికం ఠాగూర్ తన నివేదికలో హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు అని కూడా అడ్డంకి దయాకర్ బయటపెట్టారు. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ అవగాహన కలిగి ఉంటే బాగుంటుందని సీనియర్లు దాదాపు తొమ్మిది నెలల క్రితమే హైకమాండ్ ముందు ప్రతిపాదన పెట్టారని అయితే రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనపై ఆసక్తి చూపలేదని అన్నారు. అయినప్పటికీ, ఆయన మా అభిప్రాయాలను అడిగాడు కానీ మేము దాన్ని తిరస్కరించామని, ఇది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించడమే బీఆర్ఎస్ కి లొంగిపోవడమే అని దయాకర్ అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో కాంగ్రెస్ సీనియర్లు కొందరు రహస్య అవగాహన కలిగి ఉన్నారని కూడా అద్దంకి ఆరోపించారు. కాంగ్రెస్తో అవగాహన కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలు అని పిలుచుకునే వారు ఇప్పటికీ దీని కోసమే లాబీయింగ్ చేస్తున్నారని బయట పెట్టారు.