Kama Reddy: ముగ్గులతో వెరైటీ నిరసన తెలిపిన మహిళలు
Kama Reddy: జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా బాధిత రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నర్సింగాపూర్ లో ముగ్గులు వేసి రైతు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్ నుంచి గ్రామాన్ని తీసివేయాలని రైతులు కోరుతున్నారు. పండుగ తర్వాత ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బాధితులు హెచ్చరించారు.
ఇక నిరసన చేయడానికి ఎన్నోమార్గాలున్నాయి. కానీ ఇక్కడ మహిళల స్టైల్ వేరు ఏకంగా పండగ వేళ ఆడవారు వినూత్నంగా నిరసన చేపట్టారు.. నర్శింగపూర్ గ్రామంలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఇంటి ముందు ముగ్గులు వేసి మహిళ రైతులు నిరసన తెలియజేశారు. తమ గ్రామానికి చెందిన భూములను మాస్టర్ ప్లాన్ నుండి తొలిగించాలని ఎమ్మెల్యే దీనికి చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే స్టాప్ మాస్టర్ ప్లాన్ 2041 రిక్రియేషన్ జోన్, నర్శింగపూర్, జగిత్యాల అని రాసి నిరసన తెలిపారు. ‘మా భూముల్లో పరిశ్రమలు మీ భూముల్లో పంటలు’ ‘మాస్టర్ ప్లాన్ హటావో కామారెడ్డి బచావో’ అని ఇలా ఎవరికీ తోచినట్టు వారు ముగ్గులతో వెరైటీ నిరసనను ప్రదర్శించారు.