రెచ్చి పోతున్న చైన్ స్నాచెర్‌లు
హైదరాబాద్‌లో చైన్ స్నాచెర్‌లు రెచ్చిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వస్తున్న దొంగల ముఠా నగరంలోని ఏ ప్రాంతంలో స్నాచింగ్ చేయాలి. ఎవరిని టార్గెట్ చేయాలని దుండగులు ముందే ప్లాన్ వేసుకొని వస్తున్నారు. ఇదే కాదు స్నాచింగ్ అనంతరం వెంటనే తిరుగు ప్రయాణం కోసం టికెట్లను ముందుగానే బుక్ చేసుకొని రడీగా ఉంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే యూపి నుంచి నగరానికి వచ్చిన స్పాచర్
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. బెక్‌పై వెళ్తున్న మహిళలనే టార్గెట్ చేసుకున్న స్నాచెర్.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో బైక్‌పై దంపతులు నర్సిరెడ్డి కమల వెళ్తుండగా.. మరో బైక్‌పై వచ్చిన చైన్ స్నాచెర్ కమల మెడలోని పుస్తెల తాడును లాక్కెళ్లారు. మహిళ మెడలోని పుస్తెల తాడును ఒక్కసారిగా లాగడంతో మహిళ బైక్‌పై నుంచి క్రింద పడిపోయింది. తీవ్రంగా గయపడ్డ బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లి అక్కడి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడు హేమంత్ గప్తాగా గుర్తించారు పోలీసులు. మరోవైపు బైక్ పైనుంచి క్రింద పడ్డాక ఏం జరిగిందో తనకు గుర్తు లేదన్నారు కమల. తనపై చైన్ స్నాచెర్ దాడి చేశాడని ఆస్పత్రికి వచ్చాక తెలిసిందన్నారు. స్పాచెర్‌ను తన భర్త వెంబడించిన దొంగ దొరకలేదన్నారు బాధితురాలు. కమలను కొత్తపేటలోని సాయి సంజీవనీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.